Amazing Building Changes Its Shape Every Hour
Watch VIdeo Below:భవనం కొత్తగా కనిపించడానికి ఎప్పుడో ఒకసారి దాని రంగులు మార్చుతుంటాం.. కానీ ఏకంగా భవనం బయటకు కన్పించే రూపమే గంట గంటకూ మారిపోవడమంటే ఆశ్చర్యంగా ఉంది కదా..! ఈ మధ్యకాలంలో భవన నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికంగా కన్పించేలా, ఎండ వేడి లేకుండా కేవలం సూర్యకాంతి పడేలా.. రకరకాలుగా భవనాలను కడుతున్నారు. అలాంటి ఓ ప్రత్యేక భవనమే ఇది కూడా.
ఆస్ట్రియా దేశంలోని స్టైరియా నగరంలో ఈ అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. కీఫర్ టెక్నిక్ షోరూం భవనం బయటి భాగం రకరకాల డిజైన్లలోకి మారిపోతూ ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి ఇది తనంతట తానే మారిపోతుంటుంది. దీన్ని ‘డైనమిక్ ఫెకేడ్’ అంటారు.
Building Changes Its Shape Every Hour
Watch Video Below:
ఈ చిత్రమైన నిర్మాణాన్ని ఎర్నెస్ట్ గైసెల్‌బ్రెక్, తన భాగస్వాములతో కలిసి నిర్మించారు. దీన్ని 2007లో పూర్తిచేశారు. భవనం బయట భాగంలో వివిధ రకాల డిజైన్లు రావడానికి 112 మెటల్ టైల్స్ ఏర్పాటుచేశారు. ఇవి గంట గంటకూ రకరకాల డిజైన్లుగా మారిపోతూ ఉంటాయి. అద్భుతమనిపించే డైనమిక్ ఫెకేడ్ ఆర్కిటెక్చర్‌ను ఈ వీడియోలో మీరూ చూడొచ్చు.